Posts

Showing posts from August, 2021

Stereotypical Him is Love

మూసపోసిన   ప్రేమే   వాడు . తాను   నాకు   ఎనిమిదేళ్ల   వయస్సు   నుండి   పరిచయం . ఆనాడు   ఏ   కోణాన   మలిని   అంటకుండా   ఉన్నాడు . వయసుతో   పాటే   పలు   మార్పులు ,  పలుసార్లు   పల్చబడటాలు . ఒకానొక   చూడలేని   సమయాన   అత్యంత   సత్యంగా   కనపడ్డాడు . తీవ్రత   గుర్తించలేదని   అలిగి   పోయినట్టే   దూరం   పోయాడు . ఆ   రోజు   నుండి   వెతుకులాట   మొదలు . వాడో   రవ్వంత   కనపడి   ఓ   జీవితాన్ని   ఊహ   చేశాడు . ఓనాడు   రవ్వంతకు   కొసరి   నల్లపూసయ్యాడు . ఓ   యుగపు   పాకులాటని   ఉత్తిత్తి   మాటలని   తేల్చిపోయాడు .  మొహం   చిరాకు   చిమ్మినా   వాడినెవరు   కాదనలేరు . ఏ   పనీ   చెయ్యనంత   సులువుగా   ప్రాణం   వాడిని   తిరిగి   కోరుకుంటోంది . కంచెలు   తెంపుకుని ,  పెచ్చులు   అదుముకొని   మళ్ళీ   ఎదురుచూపే .  ఓ   సన్నని   రాగి   తీగ   లాగా   ఎన్నాళ్లకో   మెరుస్తాడు .  ఆశ   పుట్టినట్టు   బుద్ధి   పుట్టదెప్పుడు . రవ్వల   తీగల   ఖాళీనీ   ఓ   నలుసయ్యి   ఉండీ   లేనట్టు   పూడుస్తాడు . నలుసునైనా   అంటిపెట్టుకోకుంటే   అంతా   వృథా   అనే   ఆలోచనవగలడు . ఉందంతా     నాదేలే   అనుకునే   సమయానికి   సరిగ్గా   ఓ   సృష్టంత   చీ

Introspection

ఏకాంతం ఒంటరితనం రెండూ వేరు వేరని కొన్ని సాయంత్రాలు చెప్తుంటాయి. చుట్టూ ప్రపంచమంతా మెరిసిపోతోంటే మనస్సు చుట్టు చమురు పట్టినట్టు నలత చేరుతోంది. వెలుగుల జిలుగు కంతల్లో నొప్పి కలిగిస్తోంది. గుండెలు అదిరే ధ్వని ఎంత విపరీతమైనదో తెలుస్తోంది. ఓ రంగుల లోకం పరాయైపోయి రంగు కోల్పోతోంది. మనని మనమే ఎక్కడో వదిలేసొచ్చినట్టు ఊపిరి ప్రాణాన్ని వెలివేస్తోంది. తెలియని యంత్రమేదో లోపల నుండి ఒదిగి దాగే శూన్యాన్ని తొలుస్తోంది. మౌనం ఒకింత నయంగా అనిపిస్తోంది. కన్నుల్లో కలలన్ని అమాంతం ధార కట్టి జారుడుబండాట ఆడతాయి. అప్పుడు అర్ధమవుతుంది, మళ్ళీ పుట్టాల్సిన  అవసరం కలిగింది అని.