అసీఫా

 //ఎనిమిదేళ్ల వయసు//


అమ్మా ..అమ్మా..

నన్నిక్కడ ఎందుకు కట్టేశిండ్రే!

ఈ తాడ్లు చేతులకి పుండ్లు జేస్తున్నయి.

విడిపించుకోడం కష్టమౌతుందే,

కదలడం కూడా నొప్పౌతుందే.


మూడు రోజులైందే అన్నం తిని,

ఆకలేస్తుందే , పాలవుతున్నయే .

ఓ అంకులేమో గట్టిగా కొరుకుతున్నడే,

ఇంకో అంకులేమో పట్టుకు గిల్లుతున్నడే.

ఉన్నట్టుండి బట్టలిప్పుకుంటున్నరు ఈళ్ళు,

 మన దొడ్డిబర్రె తీరు చానా పెద్దగున్నరు.


మీద మీదెందుకు బడుతున్నరో గాని,

 ఏడేడనో తోలు మంటపుడుతుందే.

బరువౌతుందని ఏడ్చినా , ఒర్లినా

గమ్మునుండమని గద్దాయిస్తున్నరే.


ఒంటికి ఏమైతుందో తెలీట్లేదే,

రక్తం ఎందుకొస్తుందో అర్ధంకాట్లే.

గుడిలో దేవుళ్ళుంటరు అన్నవ్ కదనే,

నాకీళ్ళు తప్ప ఎవ్వరు కనపడట్లే.


ఓపిక లేదే ,

కళ్ళు మూతబడుతున్నయి.

ఎండలో ఆడకన్నవ్ !

నేనే ఇనకుండా ఆటకొచ్చిన!

వడ దెబ్బ తగిల్నట్టుంది.

అయ్యో చీకటి .. చీకటి..

Comments

  1. మస్త్ రాసిండ్రు అండి
    ఆ ఆడ బిడ్డ పడ్డ కష్టం
    ని గుండెల్ల నింపి దానిని కలం లా
    మార్చి ప్రాణం పెట్టి రాసినట్లు ఉంది 🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Love that comes back

తాతయ్య