Love that comes back

 

తిరిగి రావడం 


తిరిగి రావడం ఖచ్చితంగా అవుతుంది.

పోయిందేది పోయినట్టే రాదు.

ఇంకో తీరాన్ని వెంట తెస్తుంది.

అన్నీ కలిసుంటే అన్నీ కలిసున్నట్టే.


అనకుండా పడకుండా

మాటలు ఉన్నా 

ప్రేమ ఉండలేదు

ప్రేమ పేరూ తీరూ గల ఏది ఉండలేదు

తిరిగి రావడం మాత్రం ప్రేమే కదూ.


రెండు జీవితాల కాలమంతా 

ఒక్కొక్కటిగా ఉండే వేరు వేరు కథలు.

వేరు వేరనిపించే ఒకే కథ.

తిరిగి రావడం ప్రేమ కథ.


నాకు నువ్వు 

నీకు నేను 

తప్పిపోయినప్పుడు

ఇంటికి తిరిగి వద్దాం.

ప్రేమా ఇంటికి తిరిగి వస్తుంది.


నీకు నువ్వు 

నాకు నేను

దొరకనప్పుడు మాత్రం 

ప్రేమను ఎటో పోనిద్దాం.


తానే ఇంకో తీరాన్ని

వెతికీ,

మెచ్చీ,

తాను మారీ,

తన్ను మార్చీ తిరిగి వస్తుంది.


నీ ఇంటి మధ్యలో ఆరు మూరల చాప వేసి 

అందర్ని కూర్చొబెట్టి ఒక్కొక్కరి కథ విను

ప్రేమ తిరిగి వచ్చిందని అప్పుడు తెలుస్తుంది


కడలి 

3/1/2022. 11.53 PM





Comments

  1. కడలి కన్నీరు గా మారినప్పుడు ప్రపంచం అంతా చుట్టి ఆమె బాధను చెప్తుంది. కాని ఆ కన్నీటిలోకొట్టుకపోయే ప్రాణాలకు అది అర్ధం కాదు. దాన్నీ వాళ్లంత ప్రమాదంగానే చూస్తారు. ఆ కన్నీరు వెనుక ఉన్న కారణం వారే అని అర్ధమయ్యేసరికి యుఘాంతం అయిపోతుంది. అలానే ప్రేమ కూడా అంతే..... ప్రపంచమంత పంచాల్సింది ఇద్దరు మనుషుల మధ్య ఆగిపోతే మిగిలేది మనస్పర్ధాలే, ప్రేమ ఇంద్ర ధనుస్సు లాగా, అన్నిరంగులు కలిపితేనే దానికి అందం రెండు రంగులతో ఆపేస్తే అందమైన ఆకాశంలో ధానికివిలువేధి?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

అసీఫా

తాతయ్య