Posts

Showing posts from May, 2020

తాతయ్య

తాతయ్య-సత్యనారాయణ. ముద్దుగా ఉండేవాడు, బాగా మాట్లాడేవాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో ముందే పసిగట్టే ఛాన్స్ ఉండి ఉంటే తాత అనే ముందు పలికేదాన్నేమో. అంతకు తక్కువేం జరగలేదు. నాకు గుర్తున్నంతవరకూ నేను అమ్మ, నాన్న అనే పదాలకన్నా ఎక్కువగా పలికిన పదం 'తాత'. మా తాతయ్య చాలా అందగాడు. నల్లని కళ్ళు, కొటేరు ముక్కు, బట్టతల అయిన కూడా అందమైన బట్టతల, పల్చని చేతులు, సన్నని కాళ్ళు, మనిషి పిసరంత కూడా వంగిపోలేదు రూపంలోనూ, ఆత్మాభిమానంలోనూ. గుడ్డిగా ప్రేమించడం, తిరిగి మనకి మంచి వచ్చినా, చెడు వచ్చినా ప్రేమిస్తే పోలే అనుకునే అంత పసిపిల్లాడి మనసు ఆయనది. 'గాజుబొమ్మని సాకినట్టు సాకాడు పిల్లని' అని మా వీధి వాళ్ళు అనుకుంటుంటే ఓ వందసార్లు మాములుగా విని ఉంటాను. అవును. ఒప్పుకుంటాను. ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చేవాడు. ఎంతలా అంటే స్కూల్లో ఓసారి నా ఫ్రెండ్ని కొడితే వాళ్ళమ్మ మా ఇంటికి గొడవకు వచ్చినప్పుడు 'మా అమ్మాయి కొట్టలేదంట, మీ వాడే వచ్చి దాని చెయ్యికి తగిలాడంట!' అనే అంత వెనకేసుకొచ్చాడు. ఇంకంతే ఎన్ని తప్పులు చేశానో, అవి తప్పులో ఒప్పులో కూడా తెలీనంత ధీమాగా మనసుకి అనిపించింది చేసేశాను. ఇప్పుడు ఏ