Love that comes back
తిరిగి రావడం తిరిగి రావడం ఖచ్చితంగా అవుతుంది . పోయిందేది పోయినట్టే రాదు . ఇంకో తీరాన్ని వెంట తెస్తుంది . అన్నీ కలిసుంటే అన్నీ కలిసున్నట్టే . అనకుండా పడకుండా మాటలు ఉన్నా ప్రేమ ఉండలేదు . ప్రేమ పేరూ తీరూ గల ఏది ఉండలేదు . తిరిగి రావడం మాత్రం ప్రేమే కదూ . రెండు జీవితాల కాలమంతా ఒక్కొక్కటిగా ఉండే వేరు వేరు కథలు . వేరు వేరనిపించే ఒకే కథ . తిరిగి రావడం ప్రేమ కథ . నాకు నువ్వు నీకు నేను తప్పిపోయినప్పుడు ఇంటికి తిరిగి వద్దాం . ప్రేమా ఇంటికి తిరిగి వస్తుంది . నీకు నువ్వు నాకు నేను దొరకనప్పుడు మాత్రం ప్రేమను ఎటో పోనిద్దాం . తానే ఇంకో తీరాన్ని వెతికీ , మెచ్చీ , తాను మారీ , తన్ను మార్చీ తిరిగి వస్తుంది . నీ ఇంటి మధ్యలో ఆరు మూరల చాప వేసి అందర్ని కూర్చొబెట్టి ఒక్కొక్కరి కథ విను . ప్రేమ తిరిగి వచ్చిందని అప్పుడు తెలుస్తుంది . - కడలి 3/1/2022. 11.53 PM