Introspection

ఏకాంతం ఒంటరితనం రెండూ వేరు వేరని కొన్ని సాయంత్రాలు చెప్తుంటాయి.

చుట్టూ ప్రపంచమంతా మెరిసిపోతోంటే మనస్సు చుట్టు చమురు పట్టినట్టు నలత చేరుతోంది.

వెలుగుల జిలుగు కంతల్లో నొప్పి కలిగిస్తోంది.

గుండెలు అదిరే ధ్వని ఎంత విపరీతమైనదో తెలుస్తోంది.

ఓ రంగుల లోకం పరాయైపోయి రంగు కోల్పోతోంది.

మనని మనమే ఎక్కడో వదిలేసొచ్చినట్టు ఊపిరి ప్రాణాన్ని వెలివేస్తోంది.

తెలియని యంత్రమేదో లోపల నుండి ఒదిగి దాగే శూన్యాన్ని తొలుస్తోంది.

మౌనం ఒకింత నయంగా అనిపిస్తోంది.

కన్నుల్లో కలలన్ని అమాంతం ధార కట్టి జారుడుబండాట ఆడతాయి.

అప్పుడు అర్ధమవుతుంది, మళ్ళీ పుట్టాల్సిన అవసరం కలిగింది అని.

Comments

  1. Miru raase prathi Padham lo entho ardam undhi. keep writing and keep inspiring ❤️

    ReplyDelete
  2. ఆ మధనపడే‌‌ మనసులకు "మీరు ఒంటరి కాదు! ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి అంటే చచ్చి మళ్ళీ పుట్టాల్సిందే! ఆ సాయంకాల గర్భంలోని తామసిని చూసి భయపడితే తర్వాత వచ్చే చంద్రుడి, సూర్యుడి వెలుతురు తెలియదు కదా! తడబడితే ఎలా?"

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఎవరూ మనల్ని ఉద్ధరించరు అని గ్రహించినప్పుడు, మన ఆనందం/స్వేచ్ఛ మనలోనే ఉందని తెలుసుకున్నప్పుడు తడబాటు కి తావుండదు

      Delete
  3. ఏకాంతానికి ఒకింత తోడు దొరికే లోకంలో ఉన్నా, ఒంటరితనాన్ని దూరం చేసే వీలు మాత్రం ఎంత వెతికినా శూన్యం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Love that comes back

అసీఫా

తాతయ్య