ట్రాన్సిషన్స్ (Transitions)

 చిన్న వయసున్న అమ్మాయిలా కనిపిస్తుంది ఆమె. నిండు ఆడదాని ఆలోచనలని కొనకన్నుల్లో దాచుకుంటుంది. ఆ ఆలోచనలేమో ప్రపంచానికి కథలు చెప్తుంటాయి.

అప్పుడే మీసాలు మొలుస్తున్న ఆకతాయి కుర్రాడు అతను. చెడు అలవాటులకి దగ్గరగా జరుగుతున్న వయసు. లోకం పోకడలను తప్పు మార్గంలో తెలుసుకుంటున్న వైనం.

చేతినిండా సంపాదన. ఏది చెయ్యాలనుకుంటే అది చేయగల తెగువ. తనకి ఏం కావాలో తనకి పూర్తిగా తెలుసనే నమ్మకం. అవతలివారికి ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేదని తెలిసినతనం. వాళ్ళ అంగీకారంఆమోదం లెక్కకి రాని మొండితనం ఆమెది.

ఏవేవో రోడ్లు తిరుగుతూ అతని కాళ్లు, దమ్ము కొడుతూ చేతి వేళ్లు. పగళ్లు రాత్రుళ్లు వేళ్ల మధ్య సిగరెట్‌లాగా కాలిపోతున్నాయి. తెలిసినతనానికీతెలుసుకోవాలి అనే ఆశకీతెలిసినదనిపించే బతుకుకీ మధ్య చితికిపోతున్న జీవితం అతనిది.

అంత తెలివి ఉన్న ఏ మనిషినయినా జీవితం వదిలేస్తుంది. వాళ్లే వదిలించుకుంటారేమో. అడమనిషిని కుటుంబం వదిలించుకున్నట్టు. ఇక్కడ అదే జరిగింది. ఆమెను అందరూ వదిలేస్తేఆ అబ్బాయి తనని తాను వదిలేసుకొని ఏదో లోకంలో బతుకుతున్నాడు. రోజు మారుతోందని బతికి ఉన్న జనాల్లో ఎంతమందికి తెలుస్తోందో!

కాలం కలిపింది’ అని కాలంపైన నిందలు వేయడం తప్పు. ‘వాళ్ళు కలవాలి అని ముందే రాసి ఉంది’ అని చెప్పడం పనికిరాని మాట. ‘విధి ఆడే వింత నాటకం’ లాంటి వాడుకలో ఉన్న లైన్లని ముందు చెరిపెయ్యాలి. మనిషికి చావు, అక్షరానికి చెరిపివేత ఒక్కటేగా.

***

ముప్ఫై ఎనిమిదేళ్ల వయస్సుని స్లీవ్ లెస్ బ్లూ టాప్‌లో దాచిపెట్టిందామె. టాప్ అంటే మాములు టాప్ కాదుక్రాప్ టాప్. చేతులెత్తి చెట్టుకున్న పువ్వు కోయబోతేచెట్టే మోకాలిపైన వాలేంతటి అందాన్ని చూపించగల టాప్. 

సినిమాల్లో వర్ణించినట్టు - ఎరుపు, పసుపు మిక్సయిపోయి ఓ చిన్న రొమాంటిక్ కలర్లో ఉండే నడుము కాదు. చాలా సాధారణ మనిషి నడుము. సగటు అడమనిషి నడుము. కొటారు కాళ్ళని అంటుకుని ఉన్న బ్లూ జీన్స్ ప్యాంట్. సైడ్‌కి ఒక చిన్న స్లింగ్ బాగ్. అది కూడా పూసలూ గొలుసులూ కాకుండా లెదర్ బ్యాగ్. లూజ్ హెయిర్. మధ్య పాపిడి. చెవులను కప్పేస్తూ జుట్టు. ముంగురులు అందం పెంచుతున్నాయని ఒప్పుకొని తీరాలి. కనుబొమ్మలేమో నిశ్చలం. కన్నులు మాత్రం వెతుకులాటలో మునిగిపోయాయి. 

అలా నడుస్తూ ఆమె వెళ్తోంటే, ఓ యాక్టివా దూరం నుండి వస్తోంది. గతుకుల రోడ్డులో గుంతలు పడుతూ ముందుకు కదులుతోంది. అప్పటివరకూ రోడ్డు మధ్యలో ఉన్న ముందు టైరు ఆమె నడుస్తున్న ఎడమ వైపుకు ఆకర్షించబడినట్టు తల అటు తిప్పింది. కొన్ని క్షణాల్లో వాళ్లు ఒకరినొకరు దాటుకుని వెళ్ళిపోయారు. ఆమె ఏం గుర్తించలేదు. అతను మాత్రం ఆగిపోయాడు. 

వెనక్కి తిరిగిచూస్తేనే ఊపిరి కొనసాగుతోందని గ్రహించాడు. బండి తిప్పుకుని ఆమెను ఫాలో అవ్వడం లాంటి ప్రయత్నం చేశాడు. ఆమెను చూస్తున్నంత సేపు ఊపిరందుతోంది. బాగా తెల్సిన మొఖం. ఒక్కోసారి ఒక్కో పని చేస్తున్నప్పుడు అవతల ప్రపంచంలో ఏం జరుగుతోందో అర్థం కాదు. అసలు బుర్రకే పట్టదు. కానీ, కొన్ని పనులు చేస్తున్నప్పుడు మాత్రం మన ప్రాణాలు పెట్టి చేస్తాం. అలాంటి పనుల్లో ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయే అవకాశాలుంటాయని ఆమెని చూసిన ఆ సెకండే అతనికి అర్థమైంది. 

ఒక పది సెకండ్లపాటు ఊపిరి నిలిపి... తర్వాత తీసుకున్నంత పెద్దదిగా మారింది అతని శ్వాస విధానం. సందు చివర వచ్చింది. మళ్లీ ఆమెను చూడాలని ఆశ గుంజుతోంది. ప్రాణం తన నుంచి దూరమైపోతోందన్న బాధ. బండి మళ్లీ వెనక్కి తిరిగింది. ఎవరికోసం వెతుకుతున్నాయి ఆ కళ్ళు? ఏం వెతుకుతోందిఆమె ఉండే చోటునేమో! ఇక్కడ కాదేమో! మరెక్కడుందో! చెడ్డదైనా సరే, ఆ వెతుకులాట ఆపేయాలనే దురాశ కలిగింది అతనికి.

ఇంకోసారి వెనక తిరిగే అవకాశం లేకుండా చేసి, అటుగా వచ్చిన బండేదో ఎక్కి వెళ్ళిపోయింది. అతని మనసుకి నిలకడ తప్పింది. ఏదో కావాలికావాలి అనే ఆలోచన శ్వాసగా మారింది. ఆమె మళ్ళీ రావాలిఅతను చూడాలిఆమెని చూస్తున్నంతసేపే బతుకుతున్నట్టుంది. ఈ ఎదురుచూపంతా పురిటి నొప్పుల వేదన. అతని వల్ల కాదని గుండె బరువెక్కుతోంది. 

***

ఏమో, ఆ పిల్లాడు అలా నా చుట్టూ చక్కర్లు కొడుతుంటే ప్రాణం కుదుటగా లేదు. అతను నన్ను చూడటానికి ముందే నేను అతన్ని చూశా. ఆ యాక్టివాపైన కుర్రాడెవరని వెతుక్కుంటూ చీకటితో గొడవ పడుతూ నేను. బక్క పల్చని రూపం. కొటేరు ముక్కు. నల్లని రంగు. చేతికి ఏవేవో పిచ్చి పిచ్చి బ్యాండ్స్. జుట్టు పొడుగు. చెప్పులేమో స్లిప్ ఆన్స్. టీషర్ట్ లూజుగాటార్న్ జీన్స్. అతనెదురుగా వస్తున్నంత సేపు అటూ ఇటూ కళ్ళాడిస్తూ నాటకలాడాను. నా గుండె చప్పుడు ఉరుముతోందని భయమేసింది. చెప్పొచ్చో, చెప్పకూడదో తెలీదుగాని,బ్లూ టాప్ బిగుతయ్యింది. చూపులకంత చురుకుంటుందాఅనే ఆలోచన నరాల్లో వేణువూదింది. నా కళ్ళని దాటుకొని వెళ్లాడు. వెనక్కి తిరగాలనిపించలేదు. వెనక తిప్పుకోవాలనిపించింది. మళ్ళీ ముందునుండి దాటుకుని వెళ్ళిపోయాడు. బండి ఆపి చొక్కా లాగి హత్తుకోవాలనిపించింది. మళ్ళీ వెనకనుంచి చూపుల తాకిడికి వొళ్ళు రోమాలు పొడిచింది. చూపు తిప్పుకుని ఆటలాడాను. ఇక నా వల్ల కాదు. నేనింక అక్కడ నుండి వెళ్ళాల్సిన నిమిషం అదే. అతని ప్రాణం అతనికి వదిలేసి, ఊపిరిని మాత్రం వెంటేసుకుని వెళ్ళిపోయాను. 

సరే, అతనికంత ఊగిసలాట సహజమే. అతని వయస్సు అలాంటిది. మరి నా స్థిమితాన్ని ఎక్కడ పారేసుకున్నానో తెలియలేదు. కౌమార చూపులకి స్పందించడం కొత్తగా తగిలింది.మెత్తగా తాకింది. అక్కడ్నుండి వెనుతిరిగానన్న మాటే కానీ,మనసంతా ఆ సందుల్లోనేఆలోచనలంతా ఆ అడుగులలోనే ఆగిపోయింది.

అనంత కాలాల్లాంటి కొన్ని రోజుల తరువాత.

అతని పెదాల పొగాకుకు అలవాటుపడిన మృదుత్వం. గులాబీరేకులతో పోల్చాలన్న నా ఆశని ఆశగానే నిలిపిన పెదాలునల్లటి పెదాలు. గోరువెచ్చని శ్వాస. గరుకు బాగుంటుందని చెప్పిన స్పర్శ. నూనూగు మీసాలు. నునులేతని చెంపల పైన పల్చని గడ్డం. అదోరకం యవ్వనరక్తం పొంగుతున్న నరాలు. పదునైన చూపులు.ఎగబాగే రక్తాన్ని చూపుకే వెనక్కి తిప్పగల కోరిక గల చూపులు అవి. చూస్తున్నాడో, తొనలు వలుస్తున్నాడో తెలియని చూపులు. చూపులూచేతులూవాటిమధ్య అలల దుప్పటి విప్పి పడేసినట్టు నేను. కలుసుకున్నాము. శారీరకంగానూ, మనస్ఫూర్తిగానూ కలుసుకున్నాము. అతనికి కలయిక నిజంలా మిగిలిపోతేనాకు కలలా జరిగిపోయింది. 

కాలం కదిలిపోయింది’.

***

ఆమె కోసం ఆ రోడ్డులో కొన్ని వందలసార్లు చక్కర్లు కొట్టి ఉంటాడు. ఆ దారితో పనికిరాని సంభాషణలు చేస్తూ కాళ్ళకి నొప్పులు పెట్టాడు. ఆ గాలుల్లో ఆమె వాసన కోసం వెతుక్కొని వెర్రెత్తిపోయాడు. అతని శ్వాసని ఆ వీధులకి కాపలా పెట్టాడు. ఆమె ఆలోచనలు ఎప్పటికీ అంతు చిక్కనివి. అతనికైనారాతకైనా.

***

అనంతానంత కాలాల్లాంటి నెలల తరువాత.

ఏదో ఒక రోజునఅదే రోడ్డులో అదే మనిషి. పూర్తిగా తెలిసిపోయిందనుకున్న మనిషి. ఆ క్షణమే ప్రాణమవ్వగల ఆమె.. ఆ క్షణమే పరాయిగా ఎలా తోస్తోందో తెలియదు. సొంతం అనుకోవడం అమాయకం అనిపించే తానూతన బతుకు. 

ఈ క్షణం కూడా ఏదో వెతుక్కుంటోంది. అదే నడకఅలాంటి బట్టలేఅలాంటి జుట్టేఅచ్చు ఆ రోజులాగేఅదే టైమ్అదే వెతుకులాటతన కోసం కాదని అతనికి తెలుసు. ఎవరికోసమో తెలుసుకోవాలనీ లేదు. అటూ ఇటూ నాలుగు చుట్లు చుట్టినా ఆగలేదు ఆమె వెతుకులాట. అప్పుడొచ్చాడు అతడు. ఇతని వయసున్న కుర్రాడు. ఇతనింకేమీ మాట్లాడలేదు. ఇతనూఇతని చక్కర్లూ ఆ వీధిలో ఖాళీ అయిపోయాయి.

***

ఆ రోడ్‌ని కొన్ని వందల సార్లు అసహ్యించుకున్నాడు. పని ఉన్నా ఆ దారిని తప్పించుకు తిరుగుతన్నాడతను. ఆ గాలి సోకినా అంతులేని అసహనం కలుగుతోంది. మోసపోయాడని గాలి గుచ్చి గుచ్చి గుర్తుచేస్తోంది. ఆ గాలి గొంతు పిసికేయాలని ఉంది. ఆ రోడ్డునున్న పూల చెట్లన్నీ పీకేయాలనీఆ పూలని చిదిమి చల్లాలని ఒకటే విపరీతమైన చిరాకు. ఆమె అభిరుచులు ఎవరికీ అంతు చిక్కనివి. అతనికైనాఎవనికైనా.

***

ఒక వేసవికాలం అంత త్వరగా అయిపోతుందని చెప్పింది ఆమెతో నాకున్న జ్ఞాపకం. గుర్తులు గుర్తులుగానే మిగలడానికి కొంత టైం పడుతుందని తెలిసింది. కొత్త క్లాస్కొత్త బుక్స్కొత్త కాలేజ్. ఇవన్నీ నన్ను నాకు దూరమయ్యేలా చేస్తున్నాయనే చిరాకు. ఐ డోంట్ నో వై దీస్ థింగ్స్‌ మేక్‌ మీ ఫీల్ బ్యాడ్. రాత్రుళ్లు నిద్రపట్టట్లేదు. 16 ఇయర్ ఓల్డ్ క్లాస్మేట్స్ తలల్లో ఉన్న గుజ్జు నాకు నచ్చట్లేదు. నా వయసు నన్నెందుకు పరాయివాడిగా చూస్తోందిడిసోన్ చేస్తోంది నా ఏజ్ నన్ను. వీళ్లంతా నాకెందుకు చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారుఅసలు నేనేందుకు ఇక్కడే ఉన్నానుఇదేదీ నాది కాదు. దీనికీ నాకు సంబంధం లేదు. ఈ క్లాసులెందుకు చెప్తారుఈ చదువులెందుకున్నాయిగంట మోగగానే మాయమైపోయే వీళ్లా ఈ గొర్రెల బతుకులు మార్చేదిదీస్ షిట్టి పీపుల్. హ హ! పుట్టినందుకు బతకాలి. ఆ బతుకులో ఒక ఫేజ్.. ఈ స్టడీస్. కంపు ఇదంతా. పనికిరాని విషయం.

రోజూ పొద్దున్నే లేవాలి. అసహ్యంగానే తయారవ్వాలి. ఎందుకు పనికొస్తాయో తెలియని పుస్తకాలు మోస్తూ ముసుగులో బతకాలి. వాళ్ళు చెప్పే సోది విసుక్కుంటూ వినాలి. ఫక్ దిస్. వాళ్ళ ముందు ఏమీ తెలియని వాళ్లలా నటించాలి. వాళ్లు చెప్పే నీతులని విన్నట్టు నటించాలి. అంత చెత్తనీ భరించి ఏ సాయంత్రానికో ఇల్లు చేరాలి. మళ్ళీ ఇంట్లో వాళ్ల గొడవ. పాడయిపోతున్నారని ఏదేదో ఊహించుకోవడం. ఓ కన్ను మా పైనే ఉండటం. గదిలో ఉంటే చెవి తలుపు దగ్గర పెట్టడంముక్కుకు పని చెప్పడం. ఎక్కడికెళ్లి వస్తున్నావని పదే పదే ఎందుకు విసిగిస్తారు? ఏ పొగ వాసనో వస్తే నరకం చూపిస్తారు. వాళ్ళు లేనిపోని నరకం అనుభవిస్తారు. పక్కింటోళ్లకి వినిపించేలా గొడవలూతగువులూ. తిరిగి మాటంటే చావు ప్రయత్నాలు. బెదిరింపులు. వై డు దే కేర్ టూ మచ్హెల్ఇట్ ఈజ్.

వీళ్ళకేం తెలుసు ఈ రోజుల్లో మేము ఎలా ఉంటున్నామో! దే డోంట్ ఈవెన్ నో వాట్ క్రాప్ వీ అర్ లివింగ్ ఇన్! చూడటానికి మీసాలూ గడ్డలూ రాకపోయినా మా బ్రెయిన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. నిజంగా చెప్పాలంటే వీళ్ళకన్నా ఎక్కువ బ్రెయిన్స్ ఉన్నాయి. ఆ విషయం వీళ్ళు ఒప్పుకోరు. పైగా పిల్ల కుంకలు అని తీసి పారేస్తారు. వీళ్ళకేం తెల్సు, ఈ జనరేషన్‌లో మేం ఫేస్ చేస్తున్న ట్రామా ఏంటో. ఆ ట్రామాని భరించలేక ఏమేం చేస్తున్నామో తెలుసా! పోనీ అవైనా రిలీఫ్ ఇస్తాయేమో అని చూస్తే అవి కాసేపట్లో రియాలిటీలోకి తీసుకొస్తున్నాయి. బతకడం ఇంత నరకంగా ఉంటుందా ఈ లోకంలో.

అమ్మాయిలకు పని ఉండదాఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తారుఅడోలెసెంట్ బ్రెయిన్స్ ఇవే కాబోలు. అబ్బాయిలతో ఎప్పుడూ మాట్లాడనట్టు, ఏదో వేరే స్పీసిస్ చూసినట్టు ఎగబడటం. వాళ్లు వీళ్ళలాగా మనుషులేగా. ఎందుకంత కొత్తరకం గుర్తింపు ఇస్తారుఅలాగే కోరుకుంటారుక్లాస్‌లో వీళ్ళు చేసే పనులు టార్చర్ చేస్తాయి. హోలీ షిట్!

వీళ్ల బుర్రలు ఎంత నార్మలో. అమ్మాయిలేమో మేల్ లెక్చరర్ల వంకఅబ్బయిలేమో ఫిమేల్ లెక్చరర్ల వైపు అదో రకంగా స్టేర్ చేయడం. పనీ పాట ఉండదు. వోయిడ్. ఒకరినొకరి ఎంటర్‌టైన్ చేసుకోవడానికే బతుకులు. ఇంటోలరబుల్. ఈ వయసులో ఇలాంటి ఆలోచనలు సహజమే అంటూ పెద్దోళ్లు కబుర్లు చెప్తుంటే వింటూ కూర్చోవాలి మేము. అంత పిచ్చోల్లం కాము. 

ఎవరో కొత్త లెక్చరర్ అంట. అయితే ఏంటిటైంకి రావాలనీఅటెండన్స్ ఫుల్ ఉండాలనీ కొత్త రూల్స్ పెడుతుందంట. చిన్న పిల్లల దగ్గర చేస్కోమనాలి ఆమె షో ఆఫ్. మా దగ్గర కాదు. వాట్ డు షి థింక్ ఆఫ్ అజ్ఏమనుకుంటుందో పెద్ద మా లైఫ్ సేవ్ చేసినట్టే. ఈ రోజు క్లాస్లో ఇచ్చి పడేయాలి. పోయి ఆమె పిల్లలని కంట్రోల్ చేయమనాలిమమ్మల్ని కాదు. ఇలాంటోళ్లు వాళ్ళ పిల్లలని ఏం చేయలేక స్టూడెంట్స్‌ని డామినేట్ చేస్తుంటారు. చూడాలి, ఈమె సంగతేంటో!’

***

ఇదేంటి ఈమె మా లెక్చరరాఇన్ని రోజులు నా పక్కన కూర్చొని క్లాస్ వింటున్న వీడు ఆమె కొడుకాఆ రోజు ఆ రోడ్డులో కనిపించిన ఆ కుర్రాడు వీడేనాకొడుకు కోసం ఈ కాలేజ్‌లో లెక్చరర్‌గా జాయిన్‌ అయ్యిందానా వయసున్న కొడుకున్నాడా ఈమెకిమరి ఆ రోజు,నాతో అలా!

హోలీ ఫక్. షిట్. ఐ కాన్ట్‌ టేక్ దిస్ ఎనీ మోర్. ఐ గటా గో.

***

కొన్ని ఆకాశనంతాల కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత.

చిన్ని లేత చేతులుజబ్బల్లో మెత్తని కండసీతాకోక చిలుకలు విచ్చుకుంటున్న దేహంఅమాయకపు చూపులుఅరవిరిసిన అందాలుఅదిరే పెదాలు.. ఇవన్నీ అతన్ని ఆకర్షించాయి. కసిగా చూస్తున్న కుర్రదాని చూపులవి. పిచ్చెక్కించే చెక్కిళ్ళు. అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో కూడా ఇతన్ని చూడగానే అదోరకమైన ఆనందం. విరిసిన నువ్వు. తన అడుగులు తడబతున్నాయి. ఆ విషయం ఇతనికి తెలుస్తోంది. పసిదే అయిన అమాంతం మీదకు లాక్కునే ఆకర్షణ తన ఒంటికి ఉందని గ్రహించాడు. వెనక్కి తిరిగి చూస్తూనే ముందుకు కదులుతోంది ఆ అమ్మాయి. పిలవకుండానే పిలుస్తోంది తన జంటకి. అతని వయసులో సగం వయసుండకపోయినా ఆ కళ్ళల్లో ఆశ మాత్రం అంతకంటే ఎక్కువగానే కనిపిస్తోంది. ఆగలేకపోయాడు. తన చూపులు రమ్మని పిలుస్తుంటే.. అస్సలు ఆగలేకపోయాడు. అప్పటివరకు తన జీవితంలో జరిగినవన్నీ మరుపుకి వచ్చాయి. ముందుకు సాగితే ఏం జరుగుతుందో అనే ఆలోచన రాగానే...

పెదాలపైన నవ్వు మాయమైంది.


-----------------------------కడలి సత్యనారయణ 

Comments

  1. Why am I in love with your writings...? Ans is simple you are an incredible story teller kadali garu... Thankq for choosing this as your career ... Love ❤️❤️❤️

    ReplyDelete
  2. Chala bagundi … Manushulani kadilinchagalavi goppa kathalu .. ah kathalu vinnapudu eppudoo ekkadoo mana jeevitam lo kuda alantivi jariguntai alanti vatini manam ilanti kathala dwara nemaresukovachu … Good one “Kadali Subramanyam”

    ReplyDelete
  3. Thankyou. I’m Kadali Sathyanarayana. You might got confused. No problem vamshi, oh sorry, vishnu. ❤️😂

    ReplyDelete
  4. Chala chalaa sarlu miru narrate chesna videos vinta akkaa ippudu chala chala sarlu edi chadvestha inka ...enduko teliduu intha prema chadvina pratisare kallalo pallalo adee anandam and mansulo malli ade kothadanam excitement ...you are and u will be my inspiration your writings push young and interested writers who are taking baby steps in telugu writing...inkaa chala unnay but hope a day comes when me meet appud anni inka cheppkunta

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. That was really a good narration.

    ReplyDelete
  8. It's been a fortnight I think now the count is about 15, the number times I read this...ammayini Intha andanga varninchochu ani paatalallo vintunde...but first time nenu chadivanu...and I don't know I hate reading coz of few reasons anukondi...but this one negated my notions....thanks for proving me wrong with my preconceived notions...can't say enough...loved your words...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Love that comes back

అసీఫా

తాతయ్య