Stereotypical Him is Love

మూసపోసిన ప్రేమే వాడు.


తాను నాకు ఎనిమిదేళ్ల వయస్సు నుండి పరిచయం.

ఆనాడు  కోణాన మలిని అంటకుండా ఉన్నాడు.

వయసుతో పాటే పలు మార్పులుపలుసార్లు పల్చబడటాలు.


ఒకానొక చూడలేని సమయాన అత్యంత సత్యంగా కనపడ్డాడు.

తీవ్రత గుర్తించలేదని అలిగి పోయినట్టే దూరం పోయాడు.

 రోజు నుండి వెతుకులాట మొదలు.


వాడో రవ్వంత కనపడి  జీవితాన్ని ఊహ చేశాడు.

ఓనాడు రవ్వంతకు కొసరి నల్లపూసయ్యాడు.

 యుగపు పాకులాటని ఉత్తిత్తి మాటలని తేల్చిపోయాడు


మొహం చిరాకు చిమ్మినా వాడినెవరు కాదనలేరు.

 పనీ చెయ్యనంత సులువుగా ప్రాణం వాడిని తిరిగి కోరుకుంటోంది.

కంచెలు తెంపుకునిపెచ్చులు అదుముకొని మళ్ళీ ఎదురుచూపే


 సన్నని రాగి తీగ లాగా ఎన్నాళ్లకో మెరుస్తాడు

ఆశ పుట్టినట్టు బుద్ధి పుట్టదెప్పుడు.

రవ్వల తీగల ఖాళీనీ  నలుసయ్యి ఉండీ లేనట్టు పూడుస్తాడు.


నలుసునైనా అంటిపెట్టుకోకుంటే అంతా వృథా అనే ఆలోచనవగలడు.

ఉందంతా  నాదేలే అనుకునే సమయానికి సరిగ్గా  సృష్టంత చీకటొచ్చి వాడిని లాక్కుపోతోంది.


ఇక చాలని  మాట లోన పుట్టగానే తెలుస్తోందిది

ఇది నాతో పుట్టిన సమస్తం.

ఇది నాలో పుట్టిన సమస్తం.

వాడెప్పుడు పోయేవాడేనేనుండిపోయే మొత్తాన్ని.


-కడలి.

Comments

  1. Aww.. Sudha telugu.. Rendu saalru chadavaali.. Okko line.. Ardham chesukovalnatay.. I love it..

    ReplyDelete
  2. కడలి aka శశిరేఖా! నిన్ను అస్సలు‌ ప్రేమించకూడదు లేకుంటే అన్నింటి కంటే ఎక్కువగా వ్యసనంలా ప్రేమించాలి! ఇక్కడ చాలా మందికి వాళ్ళని ప్రేమించడమే తెలియదు కనీసం ఎలా అని కూడా! అలాంటిది‌ ఎనిమిదేళ్ళప్పుడు పరిచయం అయినవాడు మారకుండా ఎలా ఉంటాడు? వాడి పేరు ఏదైతేనేం, తనను తాను వెతుకుతూ ఉండొచ్చు మన చుట్టూ ఉన్న సమాజానికి, కట్టుబాట్లలకి విరుద్ధంగా బతుకుతూ తన ఉనికి కోసం! ఆ మూసపోయినది ప్రేమ అయితే మూసలో ఇమడనిది కడలి అంత ప్రేమనే. చూద్దాం..! లేకుంటే సమస్తం/సంద్రం నువ్వేగా!

    ReplyDelete
  3. చివరి నాలుగు లైన్లు❤❤👌👌👌

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Love that comes back

అసీఫా

తాతయ్య