Stereotypical Him is Love
మూసపోసిన ప్రేమే వాడు . తాను నాకు ఎనిమిదేళ్ల వయస్సు నుండి పరిచయం . ఆనాడు ఏ కోణాన మలిని అంటకుండా ఉన్నాడు . వయసుతో పాటే పలు మార్పులు , పలుసార్లు పల్చబడటాలు . ఒకానొక చూడలేని సమయాన అత్యంత సత్యంగా కనపడ్డాడు . తీవ్రత గుర్తించలేదని అలిగి పోయినట్టే దూరం పోయాడు . ఆ రోజు నుండి వెతుకులాట మొదలు . వాడో రవ్వంత కనపడి ఓ జీవితాన్ని ఊహ చేశాడు . ఓనాడు రవ్వంతకు కొసరి నల్లపూసయ్యాడు . ఓ యుగపు పాకులాటని ఉత్తిత్తి మాటలని తేల్చిపోయాడు . మొహం చిరాకు చిమ్మినా వాడినెవరు కాదనలేరు . ఏ పనీ చెయ్యనంత సులువుగా ప్రాణం వాడిని తిరిగి కోరుకుంటోంది . కంచెలు తెంపుకుని , పెచ్చులు అదుముకొని మళ్ళీ ఎదురుచూపే...