ట్రాన్సిషన్స్ (Transitions)
చిన్న వయసున్న అమ్మాయిలా కనిపిస్తుంది ఆమె. నిండు ఆడదాని ఆలోచనలని కొనకన్నుల్లో దాచుకుంటుంది. ఆ ఆలోచనలేమో ప్రపంచానికి కథలు చెప్తుంటాయి. అప్పుడే మీసాలు మొలుస్తున్న ఆకతాయి కుర్రాడు అతను. చెడు అలవాటులకి దగ్గరగా జరుగుతున్న వయస ు. లోకం పోకడలను తప్పు మార్గంలో తెలుసుకుంటున్న వైనం. చేతినిండా సంపాదన. ఏది చెయ్యాలనుకుంటే అది చేయగల తెగువ. తనకి ఏం కావాలో తనకి పూర్తిగా తెలుస నే నమ్మకం . అవతలివారికి ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేదని తెలిసినతనం. వాళ్ళ అంగీకారం , ఆమోదం లెక్కకి రాని మొండితనం ఆమెది. ఏవేవో రోడ్లు తిరుగుతూ అతని కాళ్లు , దమ్ము కొడుతూ చేతి వేళ్లు. పగళ్లు రాత్రుళ్లు వేళ్ల మధ్య సిగరెట్‌లాగా కాలిపోతున్నాయి. తెలిసినతనానికీ , తెలుసుకోవాలి అనే ఆశకీ , తెలిసినదనిపించే బతుకుకీ మధ్య చితికిపోతున్న జీవితం అతనిది. అంత తెలివి ఉన్న ఏ మనిషినయినా జీవితం వదిలేస్తుంది. వాళ ్లే వదిలించుకుంటారేమో. అడమనిషిని కుటుంబం వదిలించుకున్నట్టు. ఇక్కడ అదే జరిగింది. ఆమెను అందరూ వదిలేస్తే , ఆ అబ్బాయి తనని తాను వదిలేసుకొని ఏదో లోకంలో బతుకుతున్నాడు. రోజు మారుతోందన...