Posts

అసీఫా

 //ఎనిమిదేళ్ల వయసు// అమ్మా ..అమ్మా.. నన్నిక్కడ ఎందుకు కట్టేశిండ్రే! ఈ తాడ్లు చేతులకి పుండ్లు జేస్తున్నయి. విడిపించుకోడం కష్టమౌతుందే, కదలడం కూడా నొప్పౌతుందే. మూడు రోజులైందే అన్నం తిని, ఆకలేస్తుందే , పాలవుతున్నయే . ఓ అంకులేమో గట్టిగా కొరుకుతున్నడే, ఇంకో అంకులేమో పట్టుకు గిల్లుతున్నడే. ఉన్నట్టుండి బట్టలిప్పుకుంటున్నరు ఈళ్ళు,  మన దొడ్డిబర్రె తీరు చానా పెద్దగున్నరు. మీద మీదెందుకు బడుతున్నరో గాని,  ఏడేడనో తోలు మంటపుడుతుందే. బరువౌతుందని ఏడ్చినా , ఒర్లినా గమ్మునుండమని గద్దాయిస్తున్నరే. ఒంటికి ఏమైతుందో తెలీట్లేదే, రక్తం ఎందుకొస్తుందో అర్ధంకాట్లే. గుడిలో దేవుళ్ళుంటరు అన్నవ్ కదనే, నాకీళ్ళు తప్ప ఎవ్వరు కనపడట్లే. ఓపిక లేదే , కళ్ళు మూతబడుతున్నయి. ఎండలో ఆడకన్నవ్ ! నేనే ఇనకుండా ఆటకొచ్చిన! వడ దెబ్బ తగిల్నట్టుంది. అయ్యో చీకటి .. చీకటి..

Guts

Guts Who’s gutsy enough to say that They squirt when he’s there Who’s gutsy enough to say that They fake it when he’s there Who’s gutsy enough to say that They Get numb Get hurt Get yuck When he’s there There in between her thighs.

Her

Her She's full already at her home. She talks sense, her parents say. She behaves well, her teachers say. She's eight, so am I. She's too enough to be true. She makes her friends understand life better. She talks of ambition and heights to reach. She's fifteen, so am I. She's grown up to be smart. She pays her bills just like that, threatening none. She has the voice to oppose when something goes wrong. She's twenty-three, so am I. She's practically evolved human. She decides for herself when to get pregnant or whether to get pregnant. She decides for herself whom to be the father of her child or the other mother.  She's thirty-two, so am I. She's both fire and ice, society says. She's got crazy tribe that wears red lipstick everywhere. She's got a bunch of wolves which she backs up for the severe fights. She's thirty-nine, so am I. What let her be that? What made me be this? Her voice is loud. My insecurities are louder.

ట్రాన్సిషన్స్ (Transitions)

  చిన్న వయసున్న అమ్మాయిలా కనిపిస్తుంది ఆమె.   నిండు ఆడదాని ఆలోచనలని కొనకన్నుల్లో దాచుకుంటుంది.   ఆ ఆలోచనలేమో ప్రపంచానికి కథలు చెప్తుంటాయి. అప్పుడే మీసాలు మొలుస్తున్న ఆకతాయి కుర్రాడు అతను. చెడు అలవాటులకి దగ్గరగా జరుగుతున్న వయస ు. లోకం పోకడలను తప్పు మార్గంలో తెలుసుకుంటున్న వైనం. చేతినిండా సంపాదన. ఏది చెయ్యాలనుకుంటే అది చేయగల తెగువ. తనకి ఏం కావాలో తనకి పూర్తిగా తెలుస నే నమ్మకం . అవతలివారికి ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేదని తెలిసినతనం. వాళ్ళ అంగీకారం ,  ఆమోదం లెక్కకి రాని మొండితనం ఆమెది. ఏవేవో  రోడ్లు తిరుగుతూ అతని కాళ్లు ,   దమ్ము కొడుతూ చేతి వేళ్లు. పగళ్లు రాత్రుళ్లు వేళ్ల మధ్య సిగరెట్‌లాగా కాలిపోతున్నాయి. తెలిసినతనానికీ ,  తెలుసుకోవాలి అనే ఆశకీ ,  తెలిసినదనిపించే బతుకుకీ మధ్య చితికిపోతున్న జీవితం  అతనిది. అంత తెలివి ఉన్న ఏ మనిషినయినా జీవితం వదిలేస్తుంది. వాళ ్లే వదిలించుకుంటారేమో. అడమనిషిని కుటుంబం వదిలించుకున్నట్టు. ఇక్కడ అదే జరిగింది. ఆమెను అందరూ వదిలేస్తే ,  ఆ అబ్బాయి తనని తాను వదిలేసుకొని ఏదో లోకంలో బతుకుతున్నాడు.   రోజు మారుతోందన...

తాతయ్య

తాతయ్య-సత్యనారాయణ. ముద్దుగా ఉండేవాడు, బాగా మాట్లాడేవాడు. ఆయన ప్రేమ ఎలాంటిదో ముందే పసిగట్టే ఛాన్స్ ఉండి ఉంటే తాత అనే ముందు పలికేదాన్నేమో. అంతకు తక్కువేం జరగలేదు. నాకు గుర్తున్నంతవరకూ నేను అమ్మ, నాన్న అనే పదాలకన్నా ఎక్కువగా పలికిన పదం 'తాత'. మా తాతయ్య చాలా అందగాడు. నల్లని కళ్ళు, కొటేరు ముక్కు, బట్టతల అయిన కూడా అందమైన బట్టతల, పల్చని చేతులు, సన్నని కాళ్ళు, మనిషి పిసరంత కూడా వంగిపోలేదు రూపంలోనూ, ఆత్మాభిమానంలోనూ. గుడ్డిగా ప్రేమించడం, తిరిగి మనకి మంచి వచ్చినా, చెడు వచ్చినా ప్రేమిస్తే పోలే అనుకునే అంత పసిపిల్లాడి మనసు ఆయనది. 'గాజుబొమ్మని సాకినట్టు సాకాడు పిల్లని' అని మా వీధి వాళ్ళు అనుకుంటుంటే ఓ వందసార్లు మాములుగా విని ఉంటాను. అవును. ఒప్పుకుంటాను. ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చేవాడు. ఎంతలా అంటే స్కూల్లో ఓసారి నా ఫ్రెండ్ని కొడితే వాళ్ళమ్మ మా ఇంటికి గొడవకు వచ్చినప్పుడు 'మా అమ్మాయి కొట్టలేదంట, మీ వాడే వచ్చి దాని చెయ్యికి తగిలాడంట!' అనే అంత వెనకేసుకొచ్చాడు. ఇంకంతే ఎన్ని తప్పులు చేశానో, అవి తప్పులో ఒప్పులో కూడా తెలీనంత ధీమాగా మనసుకి అనిపించింది చేసేశాను. ఇప్పుడు ఏ...